తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎన్నో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. కృష్ణ ఎప్పటికప్పుడు విభిన్న, వైవిధ్యమైన చిత్రాలు నిర్మిస్తూ పరిశ్రమలో కొత్త టెక్నాలజీ తెచ్చి,మార్గదర్శకంగా నిలిచాడు. మంచితనం సరేసరి. తన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకపోయినా సరే, సినిమా రిలీజ్ అయితే చాలనుకునేవారు.