కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పెద్ద రిలీజ్ వకీల్ సాబ్ అని చెప్పాలి. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమోషన్ కూడా పీక్స్ కి చేరుకుంది. ఈ దశలో రెండు సినిమాలు వకీల్ సాబ్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి వకీల్ సాబ్ కంటే వారం ముందు విడుదలవుతున్న సుల్తాన్, రెండోది వకీల్ సాబ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లవ్ స్టోరీ.