బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా.. ఇద్దరిలో ఎవరి నటనకు వంక పెట్టలేం. అయితే బాహుబలిలో హీరో ప్రభాస్ కావడంతో క్రెడిట్ అంతా రెబల్ స్టార్ కే వెళ్లిపోయింది. బాహుబలి స్టార్ రానా అంటూ బాలీవుడ్ లో దగ్గుబాటి వారసుడికి మంచి గుర్తింపే ఉంది. అయితే ఇటీవల కాలంలో రానాకి సోలో సినిమాలు కలసి రావడంలేదు. బాహుబలి సిరీస్ తో ఆయనపై మల్టీస్టారర్ మూవీల నటుడిగా పేరుపడిపోతోందని అర్థమవుతోంది.