దేవి శ్రీ ప్రసాద్ సారథ్యంలో జీ తమిళ్ చానల్ రాక్ స్టార్ అనే సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ప్రోమో వీడియోలో డీఎస్పీ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్ తరహాలో స్టెప్పులు వేసి వావ్ అనిపించాడు. ఈ ప్రోమో వీడియోలో డీఎస్పీ డ్యాన్సులు అగ్రశ్రేణి కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి.