తాజాగా అఖిల్ మోనాల్ ని పబ్లిక్ ప్లేస్ లోనే కౌగలించుకున్నారు. ఇటీవల హైదరాబాదులో అడుగుపెట్టిన మోనాల్‌కు అఖిల్ సర్ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాదు ఎయిర్ పోర్టులో దిగిన మోనాల్ ని వెనకలా నుంచి అఖిల్ చేయి వేయడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. కానీ తన పై చేయి వేసిన వ్యక్తి అఖిల్ అని తెలియడంతో ఆమె ఆశ్చర్యపోయి ఏడుపు ప్రారంభించారు. అనంతరం అఖిల్‌ను ఎయిర్ పోర్ట్‌లోనే అందరి ముందే హగ్ చేసుకున్నారు. ఆపై తనకు అఖిల్ రెండో గిఫ్ట్ ఇచ్చాడు అని చెబుతూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎయిర్ పోర్ట్ లో మోనాల్ ని సర్ప్రైజ్ కలిసిన దృశ్యాలను అఖిల్ సార్థక్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు.