రాజీవ్ కనకాల అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎందుకు కలిసి చేయడం లేదనే వాదన పుట్టుకొచ్చింది. అయితే ఆయన ఓ సందర్భంగా మాట్లాడుతూ.. " అవకాశం వస్తే ఏ హీరోతో నైనా చేస్తానని చెప్పాడు.అంతెందుకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ తో నాయక్, అల్లు అర్జున్ తో రేసుగుర్రం లో నటించాను కదా..!" అని బదులిచ్చాడు. ఇక ఎన్టీఆర్ రాజీవ్ కనకాల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ మంచి స్నేహితులు. మిగతా అందరితో నటించిన రాజీవ్ కనకాల పవన్ కళ్యాణ్ తో నటించకపోవడానికి కారణం ఏంటో చెప్పమని కొందరు నెటిజన్లు అడిగారట. దీనికి రాజీవ్ కనకాల సమాధానంగా సినిమాల్లోని వారందరూ కుటుంబ సభ్యులుగా ఉంటాం.. మా మధ్య చిచ్చు పెట్టకండి. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని రాజీవ్ కనకాల అనేశారు.