హీరో నితిన్ వరుస విజయాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ సంవత్సరంలో నితిన్ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముచ్చటగా మూడో చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.