గత సంవత్సరం కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే చిత్ర పరిశ్రమకు 2021 సంవత్సరం బాగా కలిసివచ్చిందనే చెప్పాలి మరి. ఇక జనవరిలో క్రాక్ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు మంచి శుభారంభం అందించింది. మరోవైపు ఫిబ్రవరిలో ఉప్పెన, మార్చిలో జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్టయ్యాయి. అయితే ఇప్పటికే క్రాక్, ఉప్పెన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.