నితిన్ పుట్టినరోజు సందర్భంగా “అంధధున్” రీమేక్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో నితిన్ ఓ చేతిలో కర్ర పట్టుకొని.. కళ్ళద్దాలు ధరించి నడుస్తున్నట్టు కనిపించింది. దీన్నిబట్టి ఈ సినిమాలో నితిన్ ఒక అంధుడు పాత్ర పోషిస్తున్నారని అర్థమవుతోంది. అలాగే మరొక ఫస్ట్ ఫిలిమ్స్ విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు మాస్ట్రో మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ వీడియోను విడుదల చేస్తున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.