తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ గా మారిన రాజధాని అమరావతి లో భూముల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఇవి ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని నెలలుగా చర్చలో ఉన్న అంశాలు. ఇప్పుడు అదే ప్రాంతాన్ని నేపధ్యంగా తీసుకొని సినిమా రాబోతోంది. నిజానికి ఆ సినిమా అమరావతిలో చిత్రీకరణ జరగలేదు. అయితే అది వేరే చోట తీసి ఆ ప్రాంతంలో తీసినట్లుగా చెప్పబోతున్నారు. అదే కార్తీ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం' సుల్తాన్ 'ఇదే సినిమాని తమిళ్ లో' రేమో 'తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే ఏ హీరో అయినా మొత్తం కథ వినకుండా స్టోరీ ఓకే చెప్పరు. కానీ కార్తీక్ ఈ సినిమాకి 20 నిమిషాల కథ వినిపించగానే ఓకే చేశారట. గతంలో కార్తీక్ రైతులు మీద తీసిన సినిమా' చినబాబు 'కూడా ఎంత హిట్ అయ్యిందో మనకు తెలిసింది. అలాగే ఇప్పుడు కూడా' సుల్తాన్ 'సినిమా కూడా హిట్ కావాలని కోరుకుందాం.