ఏప్రిల్ 2వ తేదీన అజయ్ దేవగన్ పుట్టినరోజు. ఆ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందం అతని పాత్రకు సంబంధించిన ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనగా ఫస్ట్ లుక్ వంటి అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్.. అల్లూరి సీతారామరాజు(చెర్రీ), కొమరం భీమ్(తారక్) ఇద్దరు కలిసేలా మోటివేట్ చేస్తారట. మరి అటువంటి క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని బ్రహ్మాండంగా రూపుదిద్ది హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం జక్కన్నకు పెద్ద పరీక్ష అని చెప్పుకోవచ్చు.