తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు మరియు హీరోయిన్లతో పాటుగా కమెడియన్లు కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సగటు ప్రేక్షకుడు సినిమాని చూసేది మంచి ఎంటర్టైన్ మెంట్ కోసం. అది ఎక్కువగా దొరికేది హాస్యం పండించే పాత్రల ద్వారానే. అందుకే కొన్ని సినిమాలలో ఖచ్చితంగా హాస్యానికి కొంత నిడివిని కేటాయిస్తారు దర్శకులు. కానీ అన్ని సినిమాలు హాస్య ప్రధానంగా ఉండవు.