బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి తెలియని వారంటూ ఉండరు. బుల్లితెరపై తన మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సుమ మైకు పట్టుకుందంటే.. నిర్వాహకులు రిలాక్స్ అయిపోవచ్చనేది ఇండస్ట్రీ మాట. తెలుగులో యాంకర్ గా అంతలా ముద్రవేశారు సుమ. తనకు మాత్రమే సొంతమైన మాట తీరు.. హ్యూమర్ కలగలిసిన సమయస్పూర్తితో రెండు దశాబ్దాలుగా వేదికలను ఏలుతున్నారు.