తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. మహానటి సినిమాతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.