వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైయ్యారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాడు. వైష్ణవ్ తేజ్.. కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 2021లో ఉప్పెన ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.