వీడియోలో కరోనా ను దూరం పెట్టేందుకు పాటించే అన్నింటినీ చూపించారు. ముఖ్యంగా బాబీ డియోల్ ఆర్ ఆర్ టి పీ ఆర్ సీ పరీక్ష చేస్తున్నట్లుగా నటి ఐశ్వర్యరాయ్ ముక్కులో బడ్ పెట్టడం, క్వారంటైన్ కు వెళుతున్నట్లుగా తలుపు వేసుకుని గదిలోకి ఉండటం, భౌతిక దూరాన్ని పాటించడం , చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి సన్నివేశాలు అన్నీ ఫన్నీ గా ఉన్నాయి. బాబీ డియోల్ నటించిన కొన్ని సినిమాల్లోని వీడియో క్లిప్ లను అన్నింటిని ఈ వీడియోలో చేర్చి సరికొత్త వీడియోను సృష్టించారు కొందరు మీయర్స్. అందరూ తెగ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.ముఖ్యంగా కరోనా కు సంబంధించిన అన్ని విషయాలను చేర్చడం గమనార్హం. ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో చక్కగా చూపించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా ఒకసారి చేసేయండి.