తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రానాకి క్రెజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుగులోనే కాదు.. తమిళ, హిందీ సినిమాలు చేస్తుండటం వలన అక్కడ కూడా మంచి గుర్తింపు ఉంది. ఇక 'బాహుబలి' సినిమాతో రానా క్రేజ్ అన్ని భాషల్లోకి వ్యాపించింది. ఆయనతో భారీ సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.