తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. పాన్ ఇండియా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే డార్లింగ్ ప్రభాస్ కు ఎవరైనా నచ్చితే అంత ఈజీగా వదిలి పెట్టడు. టెక్నీషియన్స్ కైనా నటీనటులకైనా తనవంతు సహాయం చేస్తుంటాడు. కేవలం ఆర్థికంగానే కాకుండా కెరీర్ కు ఉపయోగపడే విధంగా సలహాలు ఇస్తుంటారు.