తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటే సీజన్ 5 ని మరింత రొమాంటిక్ గా మలచడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. గత సీజన్ లో ఎక్కువగా తెలియని మొహాలనే తమపై రుద్దారని ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులను సెలెక్ట్ చేసుకునే దిశగా నిర్వాహకులు ముందు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి సీజన్ లో ఇద్దరు టాలీవుడ్ హీరోలు, ముగ్గురు టాలీవుడ్ హీరోయిన్లు కంటెస్టెంట్స్ గా కనిపించనున్నారట. వీరి మధ్య సాగే కెమిస్ట్రీ.. బిగ్ బాస్ షో ని మరింత రొమాంటిక్ గా మార్చనున్నదని తెలుస్తోంది.