ఇస్మార్ట్ శంకర్ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తరఫున హరహర వీరమల్ల సినిమాలో నటించ బోతోంది. ఒక మీడియా సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని,పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలని నా కోరిక ఈ సినిమాతో తీరబోతోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నటుడు. పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది." అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాకుండా పవన్ చుట్టూ ఏదో ఒక శక్తి ఉందని, పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగు పెడితే, అందరూ ఆయనని చూస్తూ ఉండిపోతారు అని కూడా ఆమె చెప్పుకొచ్చింది.