"ప్రతిష్టాత్మక దాదా ఫాల్కే అవార్డు నా ప్రియమైన స్నేహితుడికి లభించిందన్న వార్త వినగానే నాకు ఎంతో ఆనందం కలిగింది. రజినీ అవార్డుకి నిజంగా అర్హుడు. ఫిల్మ్ ఇండస్ట్రీ కి మీరు చేసిన సేవలు అమోఘమైనవి. మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు. ఇంకా ఎన్నో సేవలందించే శక్తి మీకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.