ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలో హీరో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమిది. ఈ సినిమాలో నటిగా సిమ్రన్, ఎమ్ సీఎస్ పాటలు అందిస్తున్నారు. కాగా, గురువారం సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ చూసిన పలువురు సూపర్‌గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.