నాగార్జున తన 100వ చిత్రం గురించి చాలా లెక్కలు వేసుకుంటున్నారు అట. అయితే కేవలం హీరోగా చేసినవి మాత్రమే లెక్కలోకి తీసుకోవాలా... లేక అతిధి పాత్రలో చేసిన సినిమాలను కూడా కలపాలా.. అని ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఏ సినిమా అయితే పెద్ద హిట్ అవుతుందో ఆ సినిమాని 100 వ సినిమా గా చేస్తాం.. అని నాగార్జున తన వంతు సినిమా గురించి స్పష్టతనిచ్చారు