అలనాటి అందాల తార జయప్రద గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. రాజమండ్రికి చెందిన లలిత రాణి ‘భూమి కోసం’ (1974)లో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించారు. ఒక పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది.