బాలీవుడ్ లో మ్యూజిక్ ఆల్బమ్స్ తో మన తారలు కూడా మెరిశారు. రష్మిక " టాప్ టక్కర్ " అని మ్యూజిక్ ఆల్బంలో చేయగా, ఇక హన్సిక " మజా ", " బూటీ షేక్ " వంటి మ్యూజిక్ ఆల్బమ్స్ చేసి బాలీవుడ్లో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇందులో రష్మిక టాప్ టక్కర్ మ్యూజిక్ ఆల్బమ్ కు 72 మిలియన్ వ్యూస్ నమోదవగా, ఇక హన్సిక మజా కు 62 మిలియన్ వ్యూస్, బూటీ షేక్ కు 44 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి..అల్లు శిరీష్ ‘విలాయతీ షరాబ్’ అనే మ్యూజిక్ ఆల్బమ్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఇక అల్లు శిరీష్ "విలాయతీ షరాబ్ " వీటన్నింటినీ బ్రేక్ చేసి, ఏకంగా 92 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసింది. త్వరలోనే 100 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసుకోబోతోంది.