శంకర్ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. లైకా ప్రొడక్షన్స్ యాజమాన్యాన్ని కలిసి విభేదాలు పరిష్కరించుకొని.. తదనంతరం సినిమా షూటింగ్ ని పునః ప్రారంభించాలని శంకర్ ముందడుగు వేస్తున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ కమల్ హాసన్ ని కలిసి, తమిళనాడులో ఎన్నికలు పూర్తవ్వగానే భారతీయుడు 2 సినిమా షూటింగ్ ని ప్రారంభించనున్నారు.