మాస్టర్ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమైపోయారు. కబీర్ సింగ్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన మురాద్ ఖేతాని ఎండేమోల్ షైన్ తో కలసి "మాస్టర్" హిందీ రీమేక్ ని నిర్మించబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ని హీరోగా అనుకున్నారు. గత 30 రోజులుగా సల్మాన్ ఖాన్ తో కలిసి మాస్టర్ మూవీ గురించి కూడా చర్చించినట్లు సమాచారం. చర్చల అనంతరం స్టోరీ లైన్ విపరీతంగా నచ్చడంతో హిందీ రీమేక్ లో హీరోగా నటించేందుకు సల్మాన్ ఖాన్ అంగీకరించారని నివేదికలు పేర్కొంటున్నాయి.