రష్మిక చాలా చురుకుగా ఉంటారని.. ఆమె సుల్తాన్ చిత్రయూనిట్ సభ్యులందరితో కలిసి పోయారని కార్తీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె కారణంగానే సుల్తాన్ సినిమా షూటింగ్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా మారిందని ఆయన అన్నారు. అలాగే రష్మిక బాగా అల్లరి కూడా చేస్తుంటారని.. కొన్ని సందర్భాల్లో ఆమె ని భరించడం చాలా కష్టం అయ్యింది అని చెప్పి ఆయన ఆశ్చర్యపరిచారు.