లోక నాయకుడు కమల్ హాసన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగాఉన్నారు. తాజాగా ఆయన ఓ సంచలన ప్రకటన జారీ చేశారు. . సినిమాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్.. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితానికి సినిమాలు అడ్డు వస్తే.. సినిమాలు చేయడం ఆపేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.