బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొస్తూ.. మా బాస్ ను ఎవరైనా ఏమైనా అంటే నేను క్షమించను.. ఆయన ఒక్క రోజుకి దాదాపుగా 18 గంటలు పని చేస్తే, 1200 మందికి జీవనోపాధి కలుగుతుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎవరికి తెలియదు.ఆయనకు నేను భక్తుడిని. ఇది ఎంతలా అంటే శ్రీరామునికి హనుమంతుడు ఎలాగో, తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కి అన్నమాచార్యుడు ఎలానో, పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ అంతే భక్తుడని" బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు...