రష్మిక తన 25వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన సందర్భంగా.. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ యూనిట్ రష్మిక కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి బర్తడే విషెస్ తెలిపింది. ఈ పోస్టర్ లో రష్మిక సాంప్రదాయమైన చీరకట్టులో చూడచక్కగా కనిపించారు. పసుపు వర్ణం చీర కట్టిన రష్మిక పూలు కడుతున్నట్టుగా ఈ పోస్టర్ లో మనం చూడొచ్చు.