రామ్ చరణ్ తన 16వ చిత్రానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించడానికి రామ్ చరణ్ టీమ్ రెడీ అయ్యిందట. వివరాల్లోకి వెళితే, మళ్లీ రావా, జెర్సీ చిత్రాలు నిర్మించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, రామ్ చరణ్ 16వ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. అయితే ఈ సినిమా చాలా రోజుల నుండి కాంబినేషన్ చర్చల దశలో ఉందట. "ఆర్ ఆర్ ఆర్"పూర్తి అయిన వెంటనే చరణ్ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ సడన్ గా సీన్లోకి శంకర్ వచ్చి చేరడం జరిగింది.అయితే త్వరలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గౌతమ్, రామ్ చరణ్ కాంబినేషన్ లో మరొక సూపర్ హిట్ సినిమాను మనం చూడబోతున్నాం అనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తోంది..