తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సృజనాత్మక విభేదాలు వచ్చాయని.. దీంతో త్రివిక్రమ్.. తారక్ ప్రాజెక్టు ని పక్కన పెట్టేశారని సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేసి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో చేతులు కలిపారని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ వద్దకు ఒక సినిమా స్క్రిప్ట్ తెచ్చారట. అయితే ఆ కథ నచ్చినప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు చేతిలో ఉండటంతో బుచ్చిబాబుకి తారక్ మాట ఇవ్వకపోయారు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టేసరికి బుచ్చి బాబు సినిమా కి లైన్ క్లియర్ అయింది.