సైరా ఫేమ్ సురేందర్ రెడ్డి అఖిల్ 5 వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కి వారసుడు అనే టైటిల్ ఖరారు చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారసుడు అనే టైటిల్ తో 1993 లో అక్కినేని నాగార్జున ఓ సినిమా చేశారు. అయితే తన తండ్రి యొక్క సినిమా టైటిల్ "వారసుడు" అక్కినేని అఖిల్ 5వ సినిమా కి కరెక్ట్ గా సూటవుతుందని సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. మరి చివరగా ఏ టైటిల్ ఖరారు చేస్తారో తెలియాల్సి ఉంది.