డైరెక్టర్ శేఖర్ కమ్ముల వైష్ణవ్ తేజ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంట గా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో పెద్దగా ప్రచారం జరుగుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా, కమర్షియల్గా ఈ సినిమాలు సక్సెస్ కాలేదు.అయితే ప్రియాంక శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్లకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలో నటిస్తే మాత్రం ఆమె జాతకం కచ్చితంగా మారుతుందని, ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం అని చెప్పవచ్చు. ఇక ఈమె కూడా మరో సాయి పల్లవి అయ్యే అవకాశం ఉందని కూడా విశ్వసనీయవర్గాల సమాచారం .