తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. హీరోల పేర్లకు ముందు బిరుదులు ఉండటం కామన్. ఇప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాదు. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు నచ్చి మెచ్చి వాళ్లకు ఆ బిరుదులు ఇస్తుంటారు. అయితే వచ్చిన కొత్తలో ఉండే బిరుదులకు.. వాళ్లకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత వచ్చే బిరుదులకు చాలా మార్పులు వస్తాయి.