మనకు దక్షిణాదిలో నాలుగు సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి. అవి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ మరియు శాండల్ వుడ్. కానీ ఏ సినీ పరిశ్రమను తీసుకున్న అక్కడి వారి ప్రజలకు స్థానిక హీరోలంటేనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అది సహజం. పక్క ఇండస్ట్రీ హీరోలంటే కొంచెం తక్కువగానే ఆసక్తి ఉంటుంది. అలాంటిది మన తెలుగు ప్రేక్షకుల విషయానికొస్తే మన వారిని ఆధరిస్తూనే తమిళ సినీ ఇండస్ట్రీ హీరోలను సైతం ఆదరిస్తున్నారు.