తెలుగు చిత్ర పరిశ్రమలో అనంత శ్రీరామ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఎన్నో పాటలకు ప్రాణం పోశాడు. ఊహలకు ఊపిరి వస్తే, వాస్తవాలు వెల్లివిరుస్తాయి అన్నారు విజ్ఞులు. అనంత్ శ్రీరామ్ పదబంధాలు సైతం అదే తీరున సాగాయి. అనుభవం లేని సందర్భాల్లోనూ ఊహాజనితమైన పదాలతో పరుగులు తీశాడు. అవే అనంత్ శ్రీరామ్ ను ప్రత్యేకంగా నిలిపాయి.