ఫీమేల్ కమెడియన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కోవై సరళ ఇటీవల తన 58వ పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఈమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఈమెకు నలుగురు చెల్లెళ్ళు. వారి ఆలనాపాలన,విద్య, వివాహాల గురించి ఆలోచించి వారి బాధ్యతలు తీసుకొని, తన వివాహ జీవితానికి దూరం అయింది.