వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అక్కడ అక్కడ బోర్ గా అనిపించింది. ఇక కొన్ని రెగ్యులర్ సీన్లు ప్రేక్షకులను కొద్దిగా నిరాశ పరిచాయి. సెకండ్ హాఫ్ విషయానికొస్తే.. ఉత్కంఠగా సాగుతుంది. లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతం. ముఖ్యంగా కోర్టు దృశ్యాలు సీరియస్ ఎమోషనల్ గా ఉన్నా బాగా ఆకట్టుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్, కామెడీ టైమింగ్ చాలా చక్కగా పనిచేసింది. కోర్టులో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ప్రకాష్ రాజ్ ఎత్తులకు పవన్ కళ్యాణ్ వవేసిన పై ఎత్తులు, కౌంటర్ డైలాగ్ ప్రేక్షకుల చేత ఈల కొట్టించాయి. అటు మాస్ ఆడియన్స్కు ఇటు ఫ్యామిలీ అండ్ క్లాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ఇక ఫేస్ మీద స్మైల్ తెప్పించే సెటైరికల్ డైలాగ్స్ కూడా వున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, ప్రతి ఒక్క సినిమా అభిమాని కూడా ఈ సినిమా చూశాక భలే ఉంది, మార్పులు చేర్పులతో ఒరిజినల్ కంటే రీమేక్ బాగా తీశారు అనే ఫీలింగ్ తోనే బయటికి వస్తారు..