పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్. థమన్ పని చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయాలని ఎప్పటినుంచో ఉన్న తన కోరికను ఈ సినిమా ద్వారా నెరవేర్చుకున్నాడు థమన్. ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి మరీ పని చేశాడు.థమన్ కష్టానికి మాత్రం ఊహించని స్థాయిలో ఫలితం దక్కిందనే చెప్పవచ్చు.. ఇక ఈ సినిమా థమన్ జీవితం లో ద బెస్ట్ అనిపించేలా వుంది..