చిత్ర పరిశ్రమకు పవన్ కళ్యాణ్ కొంత విరామం తర్వాత మళ్ళి రీఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వకీల్ సాబ్ హవానే కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ టాక్ నడుస్తోంది. మూడున్నరేళ్ల గ్యాప్‌ను అభిమానుల ఎదురుచూపులను, వారి ఆకలిని తీర్చి సంతృప్తి కలిగించాడనే టాక్ వచ్చేసింది. ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతోన్నాడు.