ఆల్రెడీ వకీల్ సాబ్ కి భారీ హిట్ టాక్ వచ్చింది కాబట్టి కొద్దిరోజుల సమయంలోనే ఈ సినిమా 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుందని ప్రముఖ సినీ పండితులు చెబుతున్నారు. వకీల్ సాబ్ చిత్రం ఓవర్సీస్ లో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం రోజు ఉదయం 10 గంటల లోపు ఆస్ట్రేలియాలో 70 లక్షలు, న్యూజిలాండ్ దేశంలో 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. అమెరికాలో 160 ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం ఒకటిన్నర కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. కరోనా సమయం లోనూ ఈ స్థాయిలో వసూళ్లను కలెక్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే.