వకీల్ సాబ్ సినిమా చూసిన వారంతా ఆవరేజ్ కాదు.. హిట్టూ కాదు.. బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్నారు..కోర్టు గదిలో జరిగే సన్నివేశాలు పవన్ కళ్యాణ్, అంజలి, ప్రకాష్ రాజ్ ల మధ్య జరిగే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే అంజలికి కేవలం కోర్టు లో మాత్రమే ఒక సన్నివేశం అందించినా అందులో ఆమె చాలా అద్భుతంగా నటించింది..ఇక మగువా.. మగువా.. అనే ఈ పాట ఫీమేల్ వెర్షన్ లో నివేదా థామస్ చాలా అద్భుతంగా నటించి, చూసిన వారందరికి కంటతడి తెప్పించింది. చూసినవారందరూ మనసులకు హత్తుకునేలా, ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ పాటలో చక్కగా చూపించారు.