తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బన్నీ ఫ్యాన్స్ పై కేసు నమోదు కావడం జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్, మరో అభిమాని సంతోష్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 290,336, 188 సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేయడం జరిగింది.