ప్రజలకు దగ్గరవడం కోసం మూడేళ్ళ పాటు సినిమాలకు దూరమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అభిమానుల ఆకాంక్ష మేరకు తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఈ స్టార్ హీరో కి ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న ఈ హీరోకి ఎప్పటికీ స్టార్ డం ఏ మాత్రం తగ్గదు. మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కు నీరాజ నాలు పలికారు ప్రేక్షకులు.