పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరా కు కట్ చెప్పి రాజకీయ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే..దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వరుసగా పలు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్ సైన్ చేసిన మొదటి చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ ఒరిజినల్ మూవీ పింక్ కి రీమేక్ ఇది. అక్కడ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ కథ లో కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు దర్శకుడు శ్రీరామ్ వేణు.