తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో సినిమాకు ఏడాదికి పైగా సమయం తీసుకునే పవర్ స్టార్ సినిమాల కోసం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు వెయ్యికళ్లతో వేచిచూస్తుంటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తిరిగివచ్చి తెరపై కనిపిస్తే ఎలా ఉంటుందని చాలా మంది అనుకుంటారు.