తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ నయా ట్రెండ్ సెట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ ను ఎప్పుడెప్పుడు వెండి తెరపైన చూద్దామా అని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు.