చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రకాష్ రాజ్ నటనా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోగల నటుడు ఆయన. అందుకే ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నారు.